సైరా టీమ్ కు నయన్ బిగ్ షాక్.. అయోమయంలో చరణ్

Nayanathara Give Shocks To Syeraa Team

0
198

తెలుగు సినిమాల ప్రమోషన్‌కి నయనతార అస్సలేమాత్రం సహకరించడంలేదు. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన పలు సినిమాలతో ఆ విషయం స్పష్టమయిపోయింది. అయినాసరే, నిర్మాత రామ్‌చరణ్‌ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం నయనతారని చిరంజీవి సరసన ఎంపిక చేసిన విషయం విదితమే. మిగతా సినిమాల విషయమెలా వున్నా, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్‌కి మాత్రం సహకరిస్తానని నయనతార, చరణ్‌కి భరోసా ఇచ్చిందట.

ఈ నేపథ్యంలోనే ఆమె కొంత అదనపు రెమ్యునరేషన్‌ని కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. కానీ, నయనతార ఇప్పుడు ‘సైరా’ ప్రమోషన్స్‌ పట్ల ఆసక్తి చూపడంలేదన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చరణ్‌ స్వయంగా నయనతారతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, నయనతార అందుబాటులోకి రాలేదట.

కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ పబ్లిసిటీని డిజైన్‌ చేసే క్రమంలో రామ్‌చరణ్‌ చాలా బిజీగా వున్నాడు. సినిమా రిలీజ్‌కి నెల రోజులు మాత్రమే సమయం వున్న దరిమిలా, ప్రతి ప్రోగ్రామ్‌నీ చాలా జాగ్రత్తగా, వీలైనంత వేగంగా డిజైన్‌ చేసుకోవాల్సి వుంది. ప్రధానంగా తమిళనాడులో సినిమాని ప్రమోట్‌ చేయాలంటే నయనతార సహకారం తప్పనిసరి.
తెలుగులో అయితే పెద్దగా సమస్య లేదు. హిందీలోనూ చరణ్‌కి ఇబ్బందుల్లేవు. సల్మాన్‌ఖాన్‌ని ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్స్‌కి తీసుకొస్తున్నారట. అమితాబ్‌ బచ్చన్‌ ఎలాగూ ప్రచారంలో కలిసొస్తాడు గనుక, అక్కడ చరణ్‌కి ప్రమోషన్స్‌ కేక్‌ వాక్‌. ప్రస్తుతానికైతే తమన్నాతో కొన్ని ప్రోగ్రామ్స్‌ డిజైన్‌ చేయిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగు, తమిళ, హిందీకి సంబంధించి. నయనతార అందుబాటులోకి వస్తే తప్ప, పూర్తిస్థాయిలో ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.