టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విశాఖ నేతలు

తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

0
84

తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అటు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా టీడీపీ నేతలు అడారి ఆనంద్, పిల్లా రమాకుమారి పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వీరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.