గవర్నర్ విషయమై భావోద్వేగానికి గురైన కేటీఆర్

తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఉన్న

0
98

తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఉన్న అనుభూతులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచుకున్నారు. గత 10 ఏళ్లుగా నరసింహన్ రాష్ట్రానికి చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్ వేదికగా నరసింహన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందూ కూడా ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘అనేక సందర్భాల్లో ఎన్నో అంశాలపై నరసింహన్ గారితో సంభాషించే అవకాశం కలిగింది’ అంటూ గతంలో నరసింహన్తో కలిసి దిగిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అలానే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తత్రేయకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ను ప్రకటించింది.