కేసీఆర్ కంటే వారిద్దరే ఎక్కువ కష్టపడ్డారు

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లే ఎక్కువ కష్టపడ్డారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.

0
100

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లే ఎక్కువ కష్టపడ్డారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థతి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కష్టపడ్డ చాలా మంది… ఆ తర్వాత టీఆర్ఎస్‌కు దూరమయ్యారన్నారు.

అలాగే.. కరీంనగర్ లో లక్ష ఓట్లతో ఘోరంగా ఓడిపోయిన వినోద్‌కు కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తారా ? గులాబీ జెండాకు కేసీఆరే యజమాని అంటూ ఎర్రబెల్లి చెప్పడం ఎంతవరకు సబబు ? అని అరవింద్ ప్రశ్నించారు.

దేశమంతటా ఎరువు సరఫరా ఉందని, తెలంగాణ వ్యవసాయ మంత్రికి మాత్రం ఆ సోయే లేదని అరవింద్ పేర్కొన్నారు. పసుపుపై రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. బోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.