ఒప్పో నుండి నాలుగు కెమెరాల ఫోన్లు

Oppo Launches New Reno Series

0
99

ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో తమ రెనో సిరీస్ లో 3 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రెనో 2, రెనో 2జెడ్, రెనో 2 ఎఫ్ పేరుతోతీసుకొచ్చింది. రెనో ఫోన్లకు కొనసాగింపుగా రెనో 2 సిరీస్‌లో వీటిని ఆవిష్కరించింది.

రెనో మోడల్ లో 10ఎక్స్ జూమ్ అందరిని ఆకట్టుకోగా రెనో 2 మొబైల్స్‌ 20 ఎక్స్ జూమ్ ఏర్పాటు చేయడం విశేషం. అలాగే ఈ మూడు ఫోన్లలో నాలుగు రియర్‌ కెమెరాలు మరో ప్రత్యేకత. 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, 13 ఎంపీ టెలి ఫోటో సెన్సర్, 2 ఎంపీ బొకే ఎఫెక్ట్ సెన్సర్ వాడారు. రెనో 2 మోడల్ లో స్నాప్ డ్రాగన్ 730, రెనో 2 జెడ్ లో మీడియాటెక్ హిలియో పి90, రెనో 2ఎఫ్ లో మీడియాటెక్ హిలియో పీ 70 ప్రాసెసర్లను వాడింది. ఈ మూడింటిలోనూ 6.5 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చింది. అలాగే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం వూక్ ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నాలజీని పొందుపర్చింది.

రెనో 2 ఫోన్ ప్రత్యేకతలు : అల్ట్రా డార్క్ మోడ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పెషల్ షార్క్ ఫిన్ రైసింగ్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ కోసం అల్ట్రా స్టడీ మోడ్, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్, ముందు, వెనక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, యూజర్ కంటి రక్షణకు బ్లూ లైట్ ఫిల్టర్. రెడ్‌ 2 జెడ్‌, 2 ఎఫ్‌ స్మార్ట్‌ఫోన్లలో పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరాను అమర్చింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఒప్పో అధికారిక వెబ్‌సైట్ల ద్వారా లభించనున్నాయి.

ధరలు : రెనో 2 ధర రూ. 36,990, రెనో 2 జెడ్‌ ధర రూ. 29,990. ఈ రెండు ఫోన్లు వరుసగా సెప్టెంబర్‌ 20, 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. అయితే, రెనో 2 ఎఫ్‌ను మాత్రం నవంబరు నుంచి లభ్యం కానుంది.

ఒప్పో రెనో 2 ఫీచర్లు
6.55 అంగుళాల డిస్‌ప్లే
1080×2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ పై
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
48+13+8+2 రియర్‌ కెమెరా
8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌
4000 ఎంఏహెచ్‌బ్యాటరీ