‘ఆరే’సిన బుమ్రా.. మరో గెలుపు దిశగా భారత్

0
98

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 117 పరుగుల వద్ద ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 87/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 97 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కార్న్‌వాల్.. షమీ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 117 పరుగుల వద్ద హమిల్టన్ (5) ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తిరిగి అదే స్కోరు వద్ద కీమర్ రోచ్ (17) రవీంద్ర జడేజాకు దొరికిపోవడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్.. విండీస్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసి 299 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

అనంతరం రెండో ఇనింగ్స్ ప్రారంభించిన టీంఇండియా 9 పరుగుల వద్ద తోలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ .. కీమర్ రోచ్ బౌలింగ్ లో ఎల్బిగా ఓవుటయ్యి వెనుదిరిగాడు. ప్రస్తుతం పుజారా, రాహుల్ క్రీజులో వున్నారు.